Tuesday, 30 December 2014

Air Asia Flight Found In Sea

Air Asia Flight Found In Sea

Air Asia Flight Found In Sea Official Statement Has Given Some Dead Bodies Also Collected - ITEMVIDEO

A day after it disappeared en route from east Java in Indonesia to Singapore, mystery surrounds the fate of AirAsia flight QZ8501 and the 162 people on board that flight found in sea


ITEMVIDEO: ఉత్కంట వీడింది.... విషాదం మిగిలింది

Air asia flight found in sea official statement has given some dead bodies also collected

గత మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమాన సంఘటన విషాదాంతంతో ముగిసింది. సముద్ర ఉపరితలంపై కొన్ని శకలాలు కనిపించిన కొద్ది సేపటికే ఎయిర్ ఏషియా విమానం కూలిపోయినట్లు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించింది. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా అధికారులు తెలిపారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు. ఈ విషయం తెలియగానే ప్రయాణికుల బంధువుల ఆశల సౌధాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. తమ వారు ఎక్కడో చోట క్షేమంగానే ఉంటారని, తిరిగోస్తారని ఎదురుచూసిన ప్రయాణికుల బంధువులకు తీరని ఆవేదనను మిగిల్చింది.





విమానం రాడార్ పరిధినుంచి తప్పిపోయిన ప్రాంతానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను తొలుత గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయగా కొన్ని మృతదేహాలు కూడా కనిపించాయి. దాంతో విమానం సముద్రంలోనే కూలిపోయిందని స్పష్టంగా తెలిసింది. ఇక ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది. ఇంకా అక్కడ ఆ ప్రాంతం లో గాలింపు చర్యలు మమరం చేశారు. ఆ విమానం సముద్ర గర్భానికి వెళ్ళిపోయిందా లేదా కొందరు ప్రయాణికులు విమానంలో నుండి దూకార అన్నది నిర్దారణ కావాల్సి ఉంది. ఒకవేళ విమానం సముద్ర గర్భంలోకి మునిగిపోయి ఉంటె ఆ విమానాన్ని తీసే సాంకేతిక పరిజ్ఞానం కానీ, సామగ్రి కానీ ఇండోనేషియా దగ్గర లేదు. మళ్ళి అమెరికా సహాయాన్ని అది పొందాల్సి ఉంటుంది. అసలు ఆ ప్రాంతం లోనే విమానం మునిగిందా లేదా అన్నది ఇంకా నిర్దారణ కావాల్సి ఉంది.

హరికాంత్
airasia flight found in sea, singapore flights, indonesia flight incident, malaysia flight incidents, indonesia to sinagpore flight, disappeared flight found in sea, java ocean, java sea, flight in java sea, air asia flight found in ocean, flight passengers dead bodies found in sea , Air asia flight found in sea official statement has given some dead bodies also collected

Monday, 29 December 2014

Microsoft CEO Meets Narendra Modi


సత్య నాదెళ్ళ ప్రపంచానికే గర్వ కారణమైన సంస్థ మైక్రో సాఫ్ట్ కు సి ఇ ఒ. నిన్న ఆయన భారత దేశ పర్యటనకు వచ్చారు. భారత్ లో క్రిస్మస్ సంబరాలకు వచ్చిన ఆయన ప్రధాన మంత్రి మోడీ తో సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ మోడీ స్వప్నం అయిన డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా లో భాగస్వామ్యం కావాలని ఉందని ఆకాక్షించారు.

Click Here to Know More

Click Here to Know More Political News

TDP MLA's Ready to Join TRS


ఇప్పటికే టిడిపి ఎంఎల్ఏ లు టిఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.. అందులో ఒకరికి మంత్రి పదవి కూడా అధికార ప్రభుత్వం కట్టబెట్టింది. ఇంకొ ఎంఎల్ఏకు మరో ముఖ్య పదవి ఇచ్చే ఆలోచన ఉన్నట్లు కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళి ఇంకొందరు ఎం ఎల్ ఏ లు టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు బయట కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ ఎంఎల్ఏ లు కెసిఆర్ నుండి ఏదోక హామీ తీసుకొనే పార్టీ లో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారికి ఇప్పటికే కొన్ని తాయిలాలు అందజేస్తామని తెరాస వర్గాలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

Read More Here....

Click Here to Know More Political News

Thursday, 11 December 2014

Pawan Kalyan Jana Sena Party Approved by EC



రాజకీయ పార్టీ గా జన సేన కి అధికార గుర్తింపు వచ్చింది. జన సేన ను రాజకీయ పార్టీ గ గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ (56/118/2014/PPS-I) ను కూడా కేటాయించింది. చట్ట ప్రకారం ఇప్పుడు జనసేన అధికారికంగా గుర్తింపు పొందినట్లయ్యింది.

Read More Full Story.

To Know more updates Click Here

త్రివిక్రమ్ వీక్ పాయింట్ పై దెబ్బ కొట్టాడు


‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుంది’ డైరెక్టర్ త్రివిక్ర్ శ్రీనివాస్ వ్యవహారం. డైలాగులు, కమర్షియల్ యాంగిల్ తో డిఫరెంట్ సినిమాలు తీయగల సత్తా ఉన్న త్రివిక్రమ్ కు ఓ మైనస్ పాయింట్ ఉంది.. అదే నిదానం. స్లో అండ్ స్టడీ అన్నట్లు సినిమాను చెక్కుతూ.., చెక్కుతూ నిదానంగా షూట్ చేసుకుపోతాడు. దీంతో ఈయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపినా.., ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటి ఉండకపోవటంతో ఇతర ప్రాజెక్టులకు డే్ట్లు సర్ధలేక అవస్థలు పడుతుంటారు. కొందరయితే గోల్డెన్ ఛాన్స్ వదులుకునేందుకు సిద్దపడుతుంటారు కూడా.

Read More Here.....

To Know Latest Movie Updates Click Here...